మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ వేణు..!

-

మొన్నటి వరకు కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన వేణు ఎల్దండి.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి బలగం అనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఊహించని రేంజ్ లో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు కమెడియన్ కాస్త దర్శకుడిగా మారిన వేళ సినిమా అంతా కామెడీగానే ఉంటుందని అనుకున్నారు.. కానీ ఫుల్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఏడిపించేసింది. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంతో వేణు నడిపించిన.. కథ, కథనం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించాయి.

బలగం తప్పకుండా చూడాల్సిన సినిమా అని.. ఐకమత్యమే మహాబలం అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు… అంటూ వేణు పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించిన వేణుకు ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. బలగం సినిమా హిట్ టాక్ రావడమే ఆలస్యం.. వేణు సెకండ్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తీసేలా అడ్వాన్స్ కూడా ఇచ్చారట. మొత్తానికైతే దిల్ రాజు మరోసారి తన ప్రొడక్షన్ సత్తా ఏంటో బలగం సినిమాతో చూపించారు అని తెలుస్తోంది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు అంటే అది మామూలు విషయం కాదు. మరి వేణు తన సెకండ్ సినిమాతో డైరెక్టర్గా ఎలా ప్రూవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఒకవేళ వేణు దిల్ రాజు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సక్సెస్ చేసినట్లయితే ఖచ్చితంగా వేణుకి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి హోదా కల్పించబడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news