Womensday special : మహిళలకు అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తున్న క్రెడిట్ కార్డ్స్..

-

క్రెడిట్ కార్డు లేనివాడు లేడు.. దాదాపు అందరికి దగ్గర ఉన్నాయి. కస్టమర్ల అవసరాల కోసం ప్రతి బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.ప్రతి ఒక్కరిలాగే, మహిళలు తమ రోజువారీ ఖర్చుల కోసం, అప్పుడప్పుడు పెద్ద కొనుగోళ్లకు, రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌ లేదా ఇతర ప్రయోజనాల కోసం క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తారు. మహిళలు తరచూ వస్త్రాలు, కిరాణా, డైనింగ్, మూవీస్‌, ట్రావెల్‌ టిక్కెట్ల కోసం క్రెడిట్‌ కార్డ్‌లను ఎక్కువ ఉపయోగిస్తారు. ఉమెన్స్‌ డే 2023 సందర్భంగా మహిళలకు సరిపోయే బెస్ట్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ లిస్ట్‌ను పైసాబజార్‌ అందించింది.. ఆ కార్డులు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్..

ఈ కార్డ్‌ పేటీఎం మూవీస్‌లో రెండో సినిమా టిక్కెట్‌ బుకింగ్‌పై 100 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. సోనీలివ్ ప్రీమియం యాన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను, AJIOలో కనీసం రూ.2,000 ఖర్చులపై ఫ్లాట్ రూ.600 డిస్కౌంట్‌ పొందవచ్చు. కార్డ్ ద్వారా ఖర్చు చేసే ప్రతి రూ.200పై 4 EDGE రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. త్రైమాసికంలో భారతదేశంలోని ఒక విమానాశ్రయ లాంజ్‌ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తుంది.. సంవత్సరానికి రూ.500 ఫీ చెల్లించాలి..

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్..

ఫ్లిప్‌కార్ట్ , మింత్రలో 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఉబర్‌, స్విగ్గీ, పీవీఆర్‌, క్యూర్‌ఫిట్‌, టాటా ప్లే, క్లియర్‌ట్రిప్‌ ట్రాన్సాక్షన్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కార్డ్ హోల్డర్‌కు సంవత్సరంలో నాలుగు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ.500. అదే విధంగా రూ.1,100 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ ను అందుకోవచ్చు..

క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్..

ఈ కార్డ్ సంవత్సరంలో నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను అందిస్తుంది. వినియోగదారులు భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్లలో 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును పొందుతారు. అదే విధంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌ఎర్న్‌ క్రెడిట్‌ కార్డ్‌ తో,స్టాండర్డ్ చార్టర్డ్ ఈజ్‌మైట్రిప్‌ క్రెడిట్ కార్డ్ లు కూడా మంచి బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి..బస్ టిక్కెట్ బుకింగ్‌లపై రూ.125 డిస్కౌంట్‌ పొందవచ్చు. స్టాండ్‌లోన్ హోటల్, ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా అవుట్‌లెట్‌లలో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఖర్చు చేసే ప్రతి రూ.100పై 10X రివార్డ్‌లను కూడా అందిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news