ట్రైలర్ టాక్: మిడిల్ క్లాస్ మెలోడీస్.. ఆకట్టుకుంటోంది..

అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవనున్న మిడిల్ క్లాస్ మెలొడీస్ ట్రైలర్, ఈ రోజే విడుదలైంది. ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా కథ మొత్తం మిడిల్ క్లాస్ చుట్టూనే తిరుగుతుంది. మధ్యతరగతి యువకుడిగా పెరిగిన ఆనంద్ దేవరకొండ బాంబే చట్నీ చేయడం స్పెషలిస్ట్. తన తండ్రి హోటల్ ని నడిపిస్తూ ఉంటాడు. కానీ తండ్రి, కొడుకుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.

ఈ కారణంగా కొడుకు గుంటూరు వెళ్ళిపోయి హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటాడు. తండ్రి వద్దని చెప్పినా గుంటూరులో హోటల్ పెడతాడు. ఆ తర్వాత వ్యాపారం ఎలా జరిగింది, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్న అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వారికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని ఆనంద ప్రసాద్ నిర్మించగా, వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు.