వైసీపీ మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్‌…. ఆ ఇద్ద‌రికి ప‌డ‌ట్లేదా…!

-

తూర్పు గోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రికి సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఒక‌రు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌, మ‌రొక‌రు కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీ యం వేడెక్కింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌న్న‌బాబు దూకుడును అడ్డుకునేందుకు ఓ ఎమ్మెల్యేతో మంత్రి చెల్లుబోయిన చేతులు క‌లిపారని.. దీంతో క‌న్న‌బాబు ఫైర్ అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల కులు. ఈ ప‌రిణామంతో కాకినాడ వైసీపీలో కోల్డ్ వార్ సాగుతోంద‌ని అంటున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు.

ఈయ‌న త‌ర్వాత కుర‌సాల క‌న్న‌బాబు పార్టీలోకి చేరారు. అయితే, సామాజిక స‌మీక‌ర‌ణ‌లో భాగంగా కుర‌సా ల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు జ‌గ‌న్‌. కానీ, త‌న‌కు ద‌క్కాల్సిన ప‌ద‌విని క‌న్న‌బాబు ఎగ‌రేసుకుపోయార‌నేది చంద్ర‌శేఖ‌ర్ ఆవేద‌న‌. పోనీ.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకుంటే.. ద‌క్కించుకున్నారు.. త‌న‌కు వాల్యూ ఇవ్వాలి క‌దా? అనేది ఆయ‌న ప్ర‌శ్న‌. కానీ, క‌న్న‌బాబు మాత్రం.. త‌న హ‌వా తాను కొన‌సాగిస్తున్నారు. దీంతో కాకినాడలో ఆయ‌న హ‌వాను త‌గ్గించేందుకు ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది.

జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కావ‌డంతోపాటు.. సాక్షి వంటి వ్యాపారాల్లోనూ చంద్ర‌శేఖ‌ర్ బోర్డు స‌భ్యుడు. దీంతో తానేం చేసినా.. జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌ర‌నే ధీమాతో చంద్ర‌శేఖ‌ర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు తోడుగా.. మ‌రో మంత్రి అదేజిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణును క‌లుపుకొన్నారు. ఆర్థికంగా చంద్ర‌శేఖ‌ర్ అండ‌దండ‌లు అవ‌స‌ర‌మ‌ని భావించిన వేణు..  ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్టు టాక్‌. దీంతో ఇరువురు ఒక జ‌ట్టుగా ఏర్ప‌డి.. కుర‌సాల‌పై రాజ‌కీయం చేస్తున్నార‌ని క‌న్న‌బాబు.. ఆప్తులు ఆరోపిస్తున్నారు.

దీంతో అధికారులు కూడా మంత్రి క‌న్న‌బాబును లెక్క‌చేయ‌డం లేద‌ని.. ప్రొటోకాల్ ను కూడా పాటించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఈ ప‌రిణామాల‌పై గుస్సాగా ఉన్న క‌న్న‌బాబు.. ఇప్పుడు వివాదాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్తే.. మ‌రోసారి త‌న మంత్రి ప‌ద‌వికి రెన్యువ‌ల్ ఉంటుందో ఉండ‌దో.. స్థానికంగా త‌లెత్తిన వివాదాన్ని తానే ప‌రిష్క‌రించుకుంటే మంచిద‌నే ధోర‌ణిలో ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news