మంథనిలో అసలేం జరుగుతోంది. ఎప్పుడు నేర ప్రవృత్తిలో ఎక్కువగా మంథని పేరే ఎందుకు వినిపిస్తోందన్న అనుమానాలు ఇప్పుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాయి. మంథని మధుకర్ హత్య రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా అధికార టీఆర్ ఎస్ నేతల పేర్లే బలంగా వినిపించాయి. కానీ ఈ కేసులో పోలీసులు కేవలం కంటి తుడుపు చర్యలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇదొక్కటే కాదు మంతనిలో జరిగిన చాలా దాడుల్లో పోలీసుల అధికార టీఆర్ ఎస్‌కు అనుకూలంగా కేసుల విచారణ జరిపారనే వాదన బలంగా వినిపిస్తోంది. స్థానికి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు చెప్పిన వారికే ఇక్కడ పోస్టింగులు, బదిలీలు జరుగుతాయి. స్థానిక నేతలకు అనుకూలంగా కేసులను మారిస్తే గిఫ్ట్‌లు కూడా ఉంటాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
ఈ అవినీతే ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకుంది. లాయర్ వామన్‌రావు దంపతుల కేసులో కూడా పోలీసులు మొదట అసలు నిందితులను వదిలేసి కేవలం కంటితుడుపు చర్యగా విచారణ జరిపారనే ఆరోపణ వినిపిస్తోంది. ఈ విషయంపై వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీకి రాసిన లెటర్లో వివరించారు. దీంతో ఇప్పుడు పుట్ట మధును మరోసారి విచారిస్తున్నారు పోలీసులు. అయితే కిషన్‌రావు లెటర్లో పేర్లు తెలిపిన పలువురు పోలీసులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే చాలామంది పోలీసులు, ఇతర అధికారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.