వేసవిలో ట్రెండీగా కనిపించాలంటే ఇలా చెయ్యండి…!

-

ఇప్పటి వరకు చలి కాలంలో స్వెట్టర్లు వగైరా వాటిని ఉపయోగించాం. కానీ ఇప్పుడు వేసవి స్టార్ట్ అవుతోంది. ఆ ఎండ వేడికి తగ్గట్టుగా ఫ్యాషన్ ‌లో మార్పులు చేసుకోవాలి. కాస్త ఇబ్బందికరమైన బట్టలు వేసుకుంటే చాలు ఎదో ఒక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంట, స్కిన్ ర్యాషెస్ లాంటివి కూడా సంభవించొచ్చు. ఏది ఏమైనా సీజన్ కి తగినట్టు మనం బట్టలని వేసుకోవాలి. పైగా సీజనల్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ను కూడా మనం సృష్టించ వచ్చు.

మరి సమ్మర్ లో ట్రెండీగా ఉండాలి అంటే మీ డ్రెస్సింగ్ లో ఈ చిన్న మార్పులు చెయ్యండి. దీనితో మీరు ట్రెండీగా ఉంటారు. సమ్మర్ లో టైట్ ఫైట్స్ వుంచుకోలేము. అందుకే ఫ్లేర్‌డ్‌ జీన్స్‌ ని వేసుకోండి. బిగుతైన జీన్స్‌ల స్థానాన్ని వదులుగా ఉండే ఫ్లేర్‌డ్‌ జీన్స్‌ ఆక్రమించేశాయి. ఇదే సరికొత్త సమ్మర్‌ ట్రెండ్‌. దాని మీదకి స్లీవ్ లెస్ టాప్స్ వేసుకుంటే చాల అందంగా ఉంటారు. పైగా వేసవి ఉక్కపోత నుండి కూడా బయట పడొచ్చు.

అలానే లూజ్ గా ఉండే దుస్తుల్ని ధరించండి. టైట్ గా ఉంటె వేసవి లో బాగా ఇబ్బంది పడాలి. వేసవి లో కాటన్‌, లినెన్‌తో తయారైన లేత రంగుల షార్ట్స్‌ చాల ఎట్రాక్టివ్ గా కనపడతాయి. వీటిని ధరిస్తే ట్రెండీగా ఉండొచ్చు. పూల డిజైన్స్ ఉన్న షార్ట్స్, షర్టులు వంటి వాటిని ధరించండి. పసుపుపచ్చ, నారింజ, ఎరుపు, గులాబీ రంగుల పూల డిజైన్లు ఈ కాలంలో ధరిస్తే బాగుంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news