శ్రీదేవి తర్వాతే నేను మాత్రమే అలా చేయగలను.. కంగనా రనౌత్.

Join Our Community
follow manalokam on social media

గత కొన్ని రోజులుగా విపరీతమైన వివాదాల్లో ఇరుక్కుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కంగనా రనౌత్ మాత్రమే అని చెప్పవచ్చు. సినిమా విషయమైతేనేమీ, రాజకీయం అయితేనేమి మరోటైతేనేమీ కంగనా చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం తలైవి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కంగనా, తాను నటించిన తను వెడ్స్ మను సినిమా రిలీజై పది సంవత్సరాలు పూర్తి కావొస్తున్నందున సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.

తను వెడ్స్ మను తన కెరీర్లో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాతోనే ఆమెకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఐతే ఈ విషయమై ట్వీట్ చేసిన కంగనా, తను వెడ్స్ మను సినిమాలో కామెడీ బాగా పండించాను. ఇప్పట్లో కామెడీ పంచగలిగే వారు చాలా తక్కువ. శ్రీదేవి గారి తర్వాత హీరోయిన్లు కామెడీ చేయాలంటే అది నేనే అని ట్వీట్ చేసింది. మరి తనను తాను శ్రీదేవిలా అనుకుంటుందో ఏమో కానీ, ఈ వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...