త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్​ సాహా ప్రమాణ స్వీకారం

-

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని అగర్తలలోని స్వామి వివేకానంద మైదానం​లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

త్రిపుర గవర్నర్​ శ్రీ సత్యదియో నరేన్​ ఆర్య.. మాణిక్​ సాహా, కేబినెట్​ మంత్రులుగా రతన్ లాల్ నాథ్, ప్రణజిత్ సింఘా రాయ్, సంతాన చక్మా సహా ఎనిమిది మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వామపక్ష కాంగ్రెస్ కూటమి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జరిగిన పలు హింసాత్మక ఘటనలకు నిరసనగా హాజరుకాలేదని కూటమి నేతలు తెలిపారు.

ఫిబ్రవరి 16న జరిగిన ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలకు గానూ 32 చోట్ల విజయం సాధించింది కాషాయ పార్టీ. దీని మిత్రపక్షం ఐపీఎఫ్​టీ ఒక స్థానంలో గెలిచింది. 2022లో మొదటిసారి త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాణిక్​ సాహా.. తాజాగా మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.

Read more RELATED
Recommended to you

Latest news