త్రివిక్రముడి తిరుగులేని స్కెచ్ !

-

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తన కెరీర్లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరియు యూఎస్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ అనేక తెలుగు సినిమా రికార్డులను పగల గొడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Image result for trivikram srinivas

సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. అయితే సినిమా ఇంకా హాల్లో ఉండగానే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయటానికి రెడీ అయిపోయారు. ఈ సినిమాని ఈ వేసవిలో స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

 

ఇక ఎన్టీఆర్ సినిమా పక్కనపెడితే త్రివిక్రమ్ వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయినట్లు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు త్రివిక్రమ్ మెగా కాంపౌండ్ హీరోలతోనే పని చేయడానికి సిద్ధమైనట్లు ఫిలింనగర్లో తాజాగా వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళితే ఎన్టీఆర్తో సినిమా అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కొణిదెల ప్రొడక్షన్స్ – హారిక హాసిని బ్యానర్ లో సినిమా చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో హారిక హాసిని – పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో ఓ సినిమా చేస్తారు. ఫైనల్ గా మూడో మెగా ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ తోనే ఉండనుంది. ఇలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తిరుగులేని ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ కానున్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news