ఎన్.టి.ఆర్ “అయినను పోయిరావలె హస్తినకు” సినిమా విషయం లో త్రివిక్రమ్ కి షాక్ ..?

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సంవత్సరం ప్రారంభం లోనే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. చెప్పాలంటే ఈ సినిమా రికార్డ్ సినిమా గా నిలిచింది. ఇక త్రివిక్రమ్ తర్వాత సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే అఫీషియ గా ప్రకటించారు. అందుకు కన్‌ఫర్మేషన్ గా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నుంచి మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు.

 

ఎప్పటిలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ’ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ చేశారు. ఈ టైటిల్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో మళ్ళీ త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల బట్టి చూస్తే త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయో ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యో అవకాశాలు కనిపించడం లేదు. అందుకు కారణం కరోనా తో అన్ని సినిమాలకి బ్రేక్ పడ్డట్టుగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి బ్రేక్ పడింది. దాంతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఆగిపోయింది. తిరిగి మళ్ళీ మొదలయిన ఎన్.టి.ఆర్ ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొనాల్సి ఉంటుందట. దాంతో ఆగస్టు నుంచి అనుకున్న ‘అయినను పోయిరావలె హస్తినకు..’ సినిమా షూటింగ్ మొదలవదని అర్థంవుతోంది. ఈ లెక్కన త్రివిక్రమ్ కి షాకే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news