ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌రోనాను ఓడించారు.. ఎలాగో తెలుసా..?

-

క‌రోనాపై పోరులో మ‌నం విజ‌యానికి మ‌నం చాలా దూరంలో ఉన్నాం.. అని స్పెయిన్ వంటి దేశం చేతులు ఎత్తేసింది. ఇక‌, నేను, నా ప్ర‌భుత్వం చేయాల్సింది చేస్తున్నాం.. ఇక‌, క‌రోనాను తేల్చుకోవాల్సింది ప్ర‌జ‌లే-ఇదీ తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వెల్ల‌డించిన మాట‌. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన దేశాలు, ప్ర‌జ‌లు లేరా?   క‌రోనాను ఓడించే మొన‌గాడే లేరా? అంటే.. ఉన్నామ‌ని చెబుతోంది.. వియ‌త్నాం అనే క‌మ్యూనిస్టు దేశం. దీంతో దీనిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేగింది. మ‌రి అదేంటో మ‌న‌మూ తెలుసుకుందాం. వియ‌త్నాంలో ఏం జ‌రిగింది.. క‌రోనా కోర‌ల‌ను ఎలా అక్క‌డి ప్రజ‌లు, నాయ‌కులు విరిచేశారు?  అనే విష‌యాలు తెలుసుకుని మ‌న‌మూ ఫాలో అయిపోదామా?

వియ‌త్నాం.  చైనాకు అత్యంత స‌మీపంలో ఉండే అతి చిన్న, దక్షిణ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసి యాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూ ర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ దేశం భారీ ఎత్తున వార్త‌ల్లో నిలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఎక్క‌డో కొన్ని వేల కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న అమెరికా, ఇట‌లీ, ఇరాన్‌, భార‌త్ వంటి దేశాలు అత‌లాకు త‌లం అవుతున్నాయి.

మ‌రి చైనాకు అత్యంత స‌మీపంలో ఉన్న వియ‌త్నాం మాత్రం కులాసాగా ధిలాసాగా ఉంది. అక్క‌డ ప్రజ‌లు నిర్భ‌యంగా జీవిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అక్క‌డ క‌రోనా లేదా?  అక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌రోనా రా లేదా? అంటే.. వ‌చ్చింది. అయితే, తొలి ప‌ది కేసులు న‌మోదు కాగానే వియ‌త్నాం ప్ర‌బుత్వం అత్యంత వే గంగా రియాక్ట్ అయింది. కేసులు నమోదైన వెంట‌నే ఏకంగా చైనాతో ఉన్న స‌రిహ‌ద్దులు మూసేసింది. అంతేకాదు, వెనువెంట‌నే క్వారంటైన్లు ఏర్పాటు చేసింది. ఎక్క‌డా వైర‌స్ విస్త‌రించ‌కుండా ముందుగానే స‌మ‌గ్ర చ‌ర్య‌లు తీసుకుంది. దీంతో 200లుగా ఉన్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అక్క‌డితో ఆగిపోయింది.

అంతేకాదు, 200 కేసుల్లోనూ వియ‌త్నాంలో ఒక్క‌టంటే ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌క‌పోవ‌డం గ‌మ‌నా ర్హం. దీనికిగాను వియ‌త్నాం తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌లు ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌కు ఎంతైనా అవ‌స రం అనేది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట‌. అదేస‌మ‌యంలో  భార‌త్ వంటి జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో ఇలాంటి చ‌ర్య‌లు అత్యంత ఆవ‌స్య‌కం. ఇక‌, ఏపీలోనూ ఇలాంటి చ‌ర్య‌లు త‌క్ష‌ణా వ‌స‌రం. మ‌నోళ్లే క‌దా? అని జాలి చూపిస్తే.. అంతిమంగా న‌ష్ట‌పోయేది మ‌న‌మే అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించాల‌నేది ప్ర‌ధాన సూచ‌న‌. మ‌రి వియ‌త్నాం పాఠాలు విందామా?  నేర్చుకుందామా.?

Read more RELATED
Recommended to you

Latest news