త్రివిక్రమ్ లక్కీ గర్ల్, ఆ హీరోయిన్…!

-

పూజ హెగ్డే” ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిపోయిన భామ. చేసిన అన్ని సినిమాలు కూడా దాదాపుగా విజయం సాధించడంతో ఈ భామ పేరు ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో మారుమోగిపోతుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్ కొడుతుంది పూజ. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా దాదాపు అందరితో ఆమె హిట్ లు అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలోనే ఆమె ఒక దర్శకుడికి లక్కీ గర్ల్ గా మారిపోయారు. ఆ దర్శకుడే త్రివిక్రమ్ శ్రీనివాస్. అరవింద సమేత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా హీరోయిన్ గా పూజ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకత్వంలో వహించిన అల వైకుంఠపురంలో సినిమాలో కూడా ఈ భామ నటించి మెప్పించింది. నటనలో దూసుకుపోతుంది ఈ అమ్మడు.

దీనితో తన తర్వాతి సినిమాలో కూడా త్రివిక్రమ్ ఈమె కోసమే చూస్తున్నట్టు సమాచారం. అది అలా ఉంటే పూజ హెగ్డే స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టేసింది. మహేష్ బాబుతో మహర్షి సినిమా సూపర్ హిట్ అయింది, అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా, అరవింద సమేత సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో పారితోషకం కూడా భారీగా పెంచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news