త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా.. బడ్జెట్ ఎంతంటే..?

-

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. మరో వైపు బన్నీ సినిమా పనులతో త్రివిక్రమ్ తీరికలేకుండా ఉన్నాడు. జనవరిలో త్రివిక్రమ్ ఫ్రీ అయితే, ఫిబ్రవరికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. ఇంతకుముందు ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సారి చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్లనే ఆ స్థాయిలో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ను త్రివిక్రమ్ సిధ్ధం చేయనున్నాడట. త్రివిక్రమ్ తన మార్క్ నుంచి బయటికి వచ్చి చేసే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news