కాస్త ఓవర్ చేసినట్టు అనిపించట్లేదా త్రివిక్రమ్ గారూ ?

-

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో సినిమా ఇటీవల సంక్రాంతి పండుగకు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో సినిమాకి సంబంధించి సక్సెస్ సంబరాల్లో సినిమా యూనిట్ చాలా చురుగ్గా పాల్గొంటోంది. ఇటువంటి నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ని యాంకర్ మీ కెరీర్లో బెస్ట్ మూవీ ఏది అని ప్రశ్నించగా.

త్రివిక్రమ్ ఏమాత్రం ఆలోచించకుండా ‘అల వైకుంఠపురములో’ నా కెరీర్లో బెస్ట్ మూవీ అన్ని త్రివిక్రమ్ ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా ‘అల..’ను మీ కెరీర్లో ఏ స్థానంలో పెడతారు అని అడిగితే.. ప్రస్తుతానికి ఇది తన నంబర్ వన్ సినిమా అని ఆశ్చర్యకర స్టేట్మెంట్ ఇచ్చాడు త్రివిక్రమ్. తన కెరీర్ మొత్తం అయ్యాక కూడా ఇది టాప్-3లో ఉంటుందని కూడా చెప్పాడు త్రివిక్రమ్.

 

దీంతో ఈ వీడియో చూసిన చాలామంది కాస్త ఓవర్ చేసినట్టు అనిపించట్లేదా త్రివిక్రమ్ గారూ అని కామెంట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కెరీర్లోనే ఎవర్ గ్రీన్ అల్టిమేట్ బెస్ట్ మూవీ ‘అతడు’ అని ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్ రంగంలో అదరగొట్టే రేటింగ్లు సాధిస్తుందని అటువంటిది అతడు ను పక్కన పెట్టి అలా వైకుంఠపురం లో సినిమా ది బెస్ట్ మూవీ అని త్రివిక్రమ్ చెప్పటం చాలా దారుణం అని అంటున్నారు. అంతేకాకుండా ‘అలా వైకుంఠపురంలో’ సినిమా కంటే ‘అత్తారింటికి దారేది’ ఇంకా బాగుంటుంది అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version