రవితేజ ముద్దులు :ట్రోలింగ్ మామూలుగా లేదుగా..!!

-

దర్శకుడు బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య  అనే సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా లో సపోర్టింగ్ గా మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ కూడా అన్నయ్య తో పాటు నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  వాల్తేరు వీరయ్య మూవీపై పరిశ్రమలో మంచి హైప్ నెలకొంది. అలాగే బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో ఈ సినిమా సంక్రాంతి పోటీలో ఉండడంతో తో సమరం చాలా ఆసక్తిగా మారింది.

ఇప్పటికే చిరంజీవి సంబంధించిన టీజర్ వచ్చి యుట్యూబ్ ను షేక్ చేసింది.ఇక రీసెంట్ గా రవితేజ ఉన్న స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక పొతే ఈ వీడియో లో రవితేజ భాష మీద విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే… ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట.

ఈ మూవీలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక రవితేజతో కేథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. కథ రీత్యా రవితేజ-కేథరిన్ మధ్య ఘాడమైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో రవితేజ, కేథరిన్  మంచిగా పెన వేసుకొని ఫ్రీ నటించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే యాబై దాటిన రవితేజకు శ్రీ లీల తో రొమాన్స్ తో పాటు చిందులు త్రొక్కుతూ ఉంటే నే ట్రోల్  చేస్తూంటే , ఈ సినిమా కోసం మధ్యలో  ముద్దు సీన్ కూడా ఉంటే మరిన్ని విమర్శలు వస్తాయో చూడాలి. కొంత మంది సోషల్ మీడియాలో ముసలోల్లకు దసరా పండుగ అని కామెంట్స్ పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news