త్వరలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రారంభోత్సవం కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మల్టీనేషనల్ కంపెనీలు ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీనికి కారణం యంగ్ టాలెంట్ హైదరాబాద్ లో ఉందన్నారు కేటీఆర్. ప్రపంచ స్థాయి కంపెనీల రెండవ ముఖ్య కార్యాలయాలు హైదరాబాద్ లో ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ సాప్ట్ వేర్ ఎగుమతులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయని వెల్లడించారు కేటీఆర్. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని.. 5 జోన్ లతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్.