పిచ్చి నాయాళ్ళు… బండి సంజయ్ పై నోరు పారేసుకున్న బాల్క సుమన్

-

మంచిర్యాల కలెక్టరేట్ లో విప్ బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చదువురాని సన్నాసులు,పిచ్చినాయళ్లు,మూర్ఖులు.. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు. వ్యవస్థలపై అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా సంజయ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసారు.

బిడ్డా … బండి సంజయ్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని నోటికొచ్చినట్లుగా మొరిగితేనే బీజేపీ ఇటీవలి అన్ని ఎన్నికల్లో ఓడిపోయింది,డిపాజిట్లు కూడా దక్కలేదు అని హెచ్చరించారు. దేశంలో ప్రజలు పిట్టల్లా రాలడానికి బీజేపీనే కారణం అని మండిపడ్డారు. తెలంగాణ కు వ్యాక్సిన్ లు ఎందుకు రావడం లేదో సంజయ్ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. కుక్కలాగా మొరగడం కాదు అన్నారు. దేశంలోనే అత్యధికంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ కొనుగోలు చేసింది అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version