Big Breaking : టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్

-

మునుగోడు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బూర నర్సయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారు. అయితే.. ఈ మేరకు ఢిల్లీలో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన సంకేతాలిచ్చారు. త్వరలో నర్సయ్య గౌడ్ కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశాలు వున్నాయి. దీనిపై ఆయన అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అలాగే మరో సీనియర్ నేత కర్నే ప్రభాకర్‌తోనూ బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన తర్వాత టీఆర్ఎస్ టికెట్ తమకు కేటాయించాలని నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేశారు. అయినప్పటికీ.. సామాజిక సమీకరణలు, విధేయత, అంగ, అర్ధబలాన్ని పరిగణనలోనికి తీసుకున్న కేసీఆర్.. మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే అప్పగించారు. కూసుకుంట్ల అభ్యర్ధిత్వం ఖరారు చేసిన వెంటనే కర్నే ప్రభాకర్ , బూర నర్సయ్య గౌడ్‌లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు కేసీఆర్. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు నర్సయ్య గౌడ్. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version