మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. దళిత బంధు పథకానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా? లేదా అనుకూలమా? అనేది చెప్పాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు.
దళితుల కోసం ప్రధాని మోడీ ఏమీ చేయకపోయినా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దళితుల కోసం రాజీనామా చేశానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం హాస్యాస్పదమని చురకలంటించారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచించిన అంతగా ఎవరూ ఆలోచించడం లేదని పేర్కొన్నారు. అనంతరం టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీకి చెందిన పావు అని ఫైర్ అయ్యారు. దళితుల కోసం తెలంగాణ సర్కార్ దళిత బంధు పేరుతో అద్భుతమైన పథకం తీసుకు వస్తుందని చెప్పారు.