జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒక వైపు కరోనా వైరస్ థర్డ్ వేవ్… ఉందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించేందుకు తేదీలను ఖరారు చేసింది జగన్ సర్కార్. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ సెకండియర్ ప్రత్యక్ష తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించనున్నట్లు జగన్ సర్కారు తెలిపింది.
ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ అధికారిక ప్రకటన చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు కానీ ఆగస్టు 16 నుంచి తెరుచుకుంటాయని చెప్పారు. అలాగే కాలేజీ యజమాన్యాలు కరోనా నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు మరియు శానిటైజర్ వాడడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా నియమ నిబంధనలను ఏ ఒక్క కాలేజీ పాటించని యెడల… వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాగా ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.