సింగరేణిలో ఉన్న 4 బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రయివేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు.. మంగళవారం సింగరేణి కార్మికులు లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. దీంతో త్వరలోనే సింగరేణి కార్మికుల సమ్మె జరగనుంది. అయితే సింగరేణి కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పోరాట బాట పట్టింది. నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సింగరేణి కార్మికులకు మద్దతుగా దీక్ష చేయనున్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రయివేటు పరం చేయాలనుకూనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు చేస్తున్న పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. నేటి దీక్ష టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు అందరూ కూడా హాజరై సింగరేణి కార్మికుల పోరాటానికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే బల్క సుమన్ పిలుపునిచ్చారు.