సీఎం కెసిఆర్.. కాటన్ దొర లాంటోడు : టిఆర్ఎస్ ఎమ్మెల్యే

-

తెరాస ఎమ్మెల్యే ఎన్ .భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సభ్యత ,సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ కన్నా ముందు చాలా మంది పీసీసీ అధ్యక్షులుగా పని చేశారని…వారి కంటే గొప్పోడేమి కాదన్నారు. కెసిఆర్ తెలంగాణ కు కాటన్ దొర లాంటి వారని…ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ను సస్య శ్యామలం చేస్తున్నారని కొనియాడారు. తిట్లు తిడితే పెద్ద లీడర్ కాలేడనే…జన్మ లో రేవంత్ సీఎం కాలేరని చురకలంటించారు.

సమీప భవిష్యత్ లో కాంగ్రెస్ అధికారం లోకి రాదన్నారు. కెసిఆర్ ను జైలుకు పంపుతా అంటున్నారు..రేవంత్ కు ఆ అవకాశం రాదని ఎద్దేవా చేశారు. మరో ఇరవై ఏళ్ళు టీఆర్ ఎస్ తప్ప వేరే పార్టీ అధికారం లో ఉండదన్నారు. అధికారం గురించి రేవంత్ కలలు కనడం మానేయాలని…చంద్రబాబు పుణ్యాన రేవంత్ ఎంపీ అయ్యాడని గుర్తు చేశారు. వచ్చే సారి రేవంత్ ఎలా గెలుస్తాడో చూస్తా..ఇప్పటికైనా సన్మార్గం లో పయనిస్తే రేవంత్ కు మంచిదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news