ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది హైకోర్టు. ముందుగా ఈడీ కేసులను విచారిచాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో విజయ సాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే… ఎంపి విజయ సాయిరెడ్డి వాదనను తోసిపుచ్చుతూ, సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. ఏపీ హైకోర్టు తాజా నిర్ణయంతో ఎంపీ విజయసాయి రెడ్డి కి షాక్ తప్పలేదు. ఇది ఇలా ఉండగా… విజయసాయిరెడ్డికి కేంద్రంలో కీలక పదవి దక్కింది. పార్లమెంటు లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.