టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల వీరేనా..!

-

టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇటీవల ఈనెల 9న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరి పేర్లు ప్రతిపాదిస్తారో అనే ఉత్కంఠత పార్టీలో నెలకొంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజున ఫలితాలు కూడా విడుల అవుతాయి. అలాగే రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ.

కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, కోటి రెడ్డి, ఎల్ రమణలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ప్రస్తుతం కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. తిరిగి మళ్లీ అవకాశం లభించింది.telangana-assembly

హుజూరాబాద్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌషిక్ రెడ్డికి అవకాశం లభించనుంది. గతంలో గవర్నర్ కోటాలో పాడి కౌషిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించనా.. వివిధ కారణాలతో గవర్నర్ ఆఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. తాజాగా ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మరో సీనియర్  నేత సిరికొండ మధుసూదనాచారి చాలా రోజులుగా కీలక పదవి కోసం చూస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సిరికొండకు కూడా ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news