ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. అందుకని ఫోన్, మెసేజెస్, ఈ–మెయిల్, క్యూఆర్ కోడ్, లాటరీ ఇలాంటి వాటి ద్వారా డబ్బు కాజేస్తున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పీఎఫ్ అకౌంట్లలోని అమౌంట్ను కూడా వదలడం లేదు. అందుకనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫ్రాడ్స్ గురించి చెబుతోంది.
ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఫ్రాడ్స్టర్స్ బారిన పడకుండా ఈపీఎఫ్ ఖాతా వ్యక్తిగత వివరాలు, ఓటీపీ లాంటి ముఖ్యమైన వివరాలను ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోకూడదు. ఈపీఎఫ్ లింక్డ్ ఓటీపీల ద్వారా మోసాలు పెరుగుతున్నందున ఈపీఎఫ్ హెచ్చరించింది. ఆధార్ కార్డ్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, UAN నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు.
కాల్ ద్వారానే కాదు వాట్సాప్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఎవరికీ షేర్ చెయ్యకూడదు. అందుకనే ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వాటిని సోషల్ మీడియాలో కానీ ఫోన్ లో కానీ షేర్ చేసుకోకండి. దీని వలన ఇబ్బంది వస్తుంది. ఈపీఎఫ్ఓకు సంబంధిన ఏవైనా సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే EPFO అధికారిక వెబ్‌సైట్ – www.epfindia.gov.in ని సంప్రదించమని అంది. అదే విధంగా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో భద్రంగా ఉంచుకోవడం మంచిది.