ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత సమయంలో మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిదని ప్రతీ ఒక్కరూ చెబుతున్నారు. మాస్క్ లేకుంటే జరిమానా కూడా విధిస్తున్నారు. ఐతే అందరూ ఒకలా ఉంటే తానొకలా ఉంటానన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం మాత్రం భిన్నంగా ఉంది. ఇటీవల ఒకానొక వార్తా సమావేశంలో మాట్లాడుతూ, ఒకానొక రిపోర్టర్ ని మాస్క్ తీసేసి ప్రశ్నించవలసిందిగా కోరాడు.
ప్రశ్న అడిగే ముందు మాస్క్ తీసేయమని, దాని వల్ల తనేం చెబుతున్నాడో క్లియర్ గా అర్థం అవుతుందని అన్నాడు. ట్రంప్ చెప్పిన ప్రకారం ఆ జర్నలిస్ట్ మాస్క్ తీసి మాట్లాడలేదు. మీకు వినబడకపోతే గట్టిగా మాట్లాడతానని బదులిచ్చాడు. ఇదిలా ఉంటే అదే సమావేశంలో మరొక రిపోర్టర్ మాస్క్ తీసేసి ప్రశ్నించగా అతన్ని అభినందించడం విశేషం. ఐతే మాస్క్ తీయడానికి నిరాకరించిన జర్నలిస్ట్ వీడీయో ప్రస్తుతం వైరల్ గా మారింది. చాలా మంది జర్నలిస్ట్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా తొంభైవేలకి పైగా దాటింది.
President Donald Trump asked a @Reuters journalist to take off his face mask while asking a question during the U.S. Labor Day news conference at the White House pic.twitter.com/jB67ulAHlq
— Reuters (@Reuters) September 8, 2020