గెలిచింది బైడెనే.. ఎట్టకేలకు ఒప్పుకున్న ట్రంప్

-

నవంబర్ 3 యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలిచారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఈరోజు బహిరంగంగా అంగీకరించినట్లు కనిపించారు. అయినా ఇది “రిగ్గింగ్” అని ఆయన మళ్ళీ నొక్కి చెప్పారు. మొదటి నుంచి ఆయన చేస్తున్న ఈ తప్పుడు ఓటింగ్ ఆరోపణలను పునరుద్ఘాటించారు. 2016లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు గెలుచుకోవడం ద్వారా బిడెన్ ఈసారి ట్రంప్‌ ను ఓడించాడు.

donald-trump

ఇక ట్రంప్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్‌ లో బిడెన్ విజయాన్ని అంగీకరించినట్లు అనిపించింది. “ఎన్నికల్లో మోసాలు జరిగాయి కాబట్టి అతను(బైడెన్) గెలిచాడు” అని ట్రంప్ ఈ ఉదయం ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. అయితే బైడెన్ పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ట్రంప్ యొక్క ప్రచారం విజయవంతం కాకపోయినా, అనేక రాష్ట్రాల్లో ఫలితాలను తారుమారు చేయాలని కోరుతూ వ్యాజ్యాల దాఖలు చేసింది రిపబ్లిక్ పార్టీ. న్యాయ నిపుణులు ఈ వ్యాజ్యం ఎన్నికల ఫలితాలను మార్చడానికి తక్కువ అవకాశం ఉందని చెప్పడంతో మళ్ళీ వెనక్కు తగ్గారు.  

 

Read more RELATED
Recommended to you

Exit mobile version