ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. మీడియాలో భిన్న కధనాలు !

-

కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. 40 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. వయో భారం కారణంగా ట్రంప్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారుని అంటున్నారు. వాల్టర్ రీట్‌ లోని అమెరికన్ జాతీయ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్‌ కు ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయన ఆక్సిజన్ లెవల్స్ 60 నుంచి 70 శాతానికి పడిపోయాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయనకు యాంటీ బాడీస్ ఎక్కించి రెమ్‌డెసివర్ థెరపీ చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రమాదం నుంచి బయటపడలేదని, ఎప్పటికి కోలుకుంటారో చెప్పలేమని డాక్టర్లు ప్రకటించారు. గడచిన 24 గంటల్లో ఆయన ఆక్సిజన్ లెవల్స్ అత్యంత ఆందోళన కర స్థాయిలో పడిపోయాయని, వచ్చే రెండు రోజులు ఆయనకు కీలకమైనవని డాక్టర్లు తెలిపారు. ట్రంప్ ఆరోగ్య వివరాలను వైట్‌ హౌస్ గోప్యంగా ఉంచుతోంది. అమెరికా మీడియా కూడా అయన ఆరోగ్యం విషయంలో భిన్న కధనాలు ప్రసారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news