రికరింగ్ డిపాజిట్లతో లాభం.. రిస్క్ తక్కువే..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులను పొదుపు చేయడం చాలా అవసరం. ఇక భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బులు ఆదా చేసుకుంటూ వెళ్లాలి మరి. ఆలా చేయకుంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చునని అంటున్నారు నిపుణులు. అంతేకాదు డబ్బులు పొదుపు చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిల్లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగంగానే చెప్పుకోవచ్చు అని నిపుణులు తెలిపారు.

Banks
Banks

అయితే స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో రికరింగ్ డిపాజిట్లు కూడా ఇందులో భాగంగానే ఉంటాయన్నారు. ఇక రికరింగ్ డిపాజిట్లలో RD డబ్బుల పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మెచ్యూరిటీ సమయంలో కళ్లుచెదిరే లాభం పొందొచ్చునని అన్నారు. మీరు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వెళ్లాలని తెలియజేశారు. ఇలాగే దీర్ఘకాలం అంటే పదేళ్ల వరకు డిపాజిట్ చేసుకుంటూ వెలితే రూ.లక్షల్లో రాబడి వస్తుందని వారు తెలిపారు.

అంతేకాక ప్రస్తుతం చాలా బ్యాంకులు, పోస్టాఫీస్‌లలో రికరింగ్ డిపాజిట్ సేవలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అన్నింటిలో ఒకే రకమైన వడ్డీ రాదు. అధిక వడ్డీ లభించే బ్యాంకులో డబ్బుల పెడితే మంచి రాబడి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌డీలపై ఆకర్షణీయ వడ్డీని అందిస్తోంది.

మీరు ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలో ఈ బ్యాంకులో డబ్బులు రికరింగ్ డిపాజిట్ చేసుకుంటే మీకు 6.65 శాతం వడ్డీ వస్తుందని తెలిపారు. అదే మీరు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు డబ్బులు కట్టుకుంటూ వెళ్తే అప్పుడు మీకు 6.7 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. ఇక మూడేళ్ల నుంచి 8 ఏళ్ల కాలం వరకు డబ్బులు డిపాజిట్ చేసుకుంటే పోతే 6.5 శాతం వడ్డీ పొందొచ్చునన్నారు. అదే 8 ఏళ్ల నుంచి పదేళ్లలోపు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 6.35 శాతం వడ్డీ వస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news