శిక్ష పడక తప్పదు…ట్రంప్ అధికార దుర్వినియోగి..!!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న అభిశంసన తీర్మానం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొంది ఇప్పుడు సెనేట్ లో చర్చలు జరుగుతున్న విషయమ విధితమే. సెనేట్ లో జరిగే వాదోపవాదనలు, చర్చలు ఆధారంగానే, ట్రంప్ అధ్యక్ష పదివిలో కొనసాగుతారో లేదోనన్న విషయం త్వరలో తేలిపోతుంది. తాజాగా సెనేట్ లో జరిగిన వాదనల ప్రకారం..

అధ్యక్ష పదవిలో ఉంటూ ట్రంప్, అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, అమెరికన్ కాంగ్రెస్ కు అడ్డుపడిన నేరానికి ఆయనను తప్పక శిక్షించాలని, అభిశంసన విచారణలో భాగంగా, సెనేటర్ ఆడమ్ స్కిఫ్ తో పాటు హౌస్ మేనేజర్లు కూడా  వారి అభిప్రాయాలను సెనేట్ కి స్పష్టం చేశారు. అది మాతమే కాదు,  కాకుండా వారి వాదనకు మద్దతుగా కొన్ని వీడియోలను, ఇంకా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ ని ప్రదర్శించారు…

 

అంతేకాదు, ట్రంప్ ను పదవి నుంచి తొలగించి, తగినట్టుగా శిక్షించకపోతే, భవిషత్తులో ఆ పదివిలోకి వచ్చేవారు కూడా ఇదేమాదిరి పద్ధతిని అనుసరించే ప్రమాదం ఉందని స్కిఫ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, అభిశంసనపై ట్రంప్ తన వాదన వినిపించేందుకు 3 రోజులు గడువు ఇవ్వగా, ఇప్పుడు ఆ గడువులో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ డిఫెన్స్ న్యాయ సలహా బృందం తన వాదనను వినిపించాల్సి ఉంది. మరి భవిష్యత్తులో ట్రంప్ పై అభిశంసన నెగ్గుతుందా లేక ట్రంప్ అభిశంసన పై నెగ్గుతాడా అనేది చర్చనీయంశంగా మారింది.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news