జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి రాజధాని అమరావతి విషయంలో భూ కుంభకోణం జరిగిందని లక్షలకోట్ల అవినీతి రాజధాని అమరావతి భూసేకరణలో జరిగిందని ఆరోపించడం జరిగింది. అయితే భూ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ నేతలే ఉన్నారని చంద్రబాబు బినామీలు మరియు ఆయన సన్నిహితులు ఈ భూ కుంభకోణం లో ఉన్నారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఖచ్చితంగా భూసేకరణ విషయంలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని రుజువు చేస్తే రాష్ట్ర ప్రజలంతా సెల్యూట్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ మేధావులు.
కానీ రుజువు చేయడం చాలా అసాధారణ మని మరోపక్క వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలు విషయంలో చంద్రబాబు సర్కార్ రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తే, 50 వేల ఎకరాల పైన అక్రమాలు జరిగాయని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దాంట్లో ప్రభుత్వ భూమినీ, అమరావతి చుట్టూ వున్న భూముల్నీ కలిపేశారు.
ఇప్పుడేమో, మొత్తంగా 4 వేల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించాయని ప్రభుత్వం చెబుతోంది. విచారణ మొదలయ్యింది.. అందులో ఎంత అక్రమం.? ఎంత సక్రమం.? అన్నది తేలాల్సి వుంది. ఈ భూ కుంభకోణం విషయంలో జరిగిన అవినీతి వైయస్ జగన్ బయట పెడితే మాత్రం దేశవ్యాప్తంగానే హైలెట్ అవుతుందని ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల జరిగిన ఈ ఘటన రాజకీయంగా జాతీయ స్థాయిలో జగన్ కి మంచి పేరు తీసుకు వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఇలాంటి కేసుల్లో ఆధారాలతో సహా నిరూపించడం ఇంపాజిబుల్ అని మరో పక్క కామెంట్లు చేస్తున్నారు.