జనం చస్తున్నా ఉగ్రవాదులను చంపుతున్న ట్రంప్

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసీడర్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఆయనలో మాత్రం మార్పు ఏ విధంగా కూడా రావడం లేదు. అక్కడ ప్రతీ రోజు వేలాది కేసులు నమోదు అవుతున్నా సరే నా వైఖరి నాదే అన్న చందం గా వ్యవహరిస్తున్నారు ఆయన. ఎన్నికల ప్రచారానికి కూడా సిద్దమయ్యారు.

ఇది పక్కన పెడితే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ కరోనా కేసులు ఉన్నా సరే ఇరాక్ ఇరాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల మీద దాడులు ఆపలేదు అమెరికా. అక్కడ ఉగ్రవాద స్తావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగుతుంది. దాదాపు పది మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అమెరికా కాల్చి చంపినట్టు సమాచారం. ఇరాక్ బలగాల సహకారంతో ఈ దాడులకు అమెరికా దిగింది.

ఈ దాడుల్లో ఇరాన్ సైన్యాన్ని కూడా అమెరికా టార్గెట్ చేసింది అని సమాచారం. అమెరికాలో కేసులు ఉండి జనాలు చనిపోతున్నా సరే ట్రంప్ లో మాత్రం మార్పు రావడం లేదు. దీనిపై ఆ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ లో కరోనా తగ్గు ముఖం పట్టింది. ఇప్పటికే ఇరాన్ లో కరోనా కేసులు ఉండటానికి అమెరికా కారణం అని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశం ఏదైనా చర్యలకు దిగితే మాత్రం అమెరికా భారీగా నష్టపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news