అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు లాంటిది ఏమీ లేదని ఆయన ఫిజీషియన్ షాన్ కానలే పేర్కొన్నారు. కరోనా సోకిన సమయానికి, ఇప్పటికి ట్రంప్ పరిస్థితి మెరుగుపడిందని ఆయన అన్నారు. ట్రంప్ కు ఇప్పటిదాకా రెండు సార్లు రెమిడెసివిర్ ఇచ్చారని, రెమిడెసివిర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్త లేదని ప్రకటించారు సీన్ కాన్లే. ఇక ట్రంప్ కు ప్రస్తుతం జ్వరం లేదని, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా చికిత్స తర్వాత పెరిగాయని అన్నారు.
అలానే ప్రస్తుతం ట్రంప్ ఆక్సిజన్ లెవెల్స్ 96 నుంచి 98 మధ్య నిలకడగా ఉన్నాయని ప్రకటించారు సీన్ కాన్లే. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా… ట్విట్టర్లో మాత్రం యాక్టివ్‌గానే ట్రంప్ ఉన్నారు. తన చికిత్సతో పాటు అమెరికాలో కరోనాపై పోరాటానికి సంబంధించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తనకు అనిపిస్తోందని ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రేమతో అందరికీ కృతజ్ఞతలు అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అలానే అధ్యక్షుడిగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. తనకేమీ కాలేదని త్వరలోనే మెలానియాతో కలిసి బయటికి వస్తానని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.