ఇండియన్‌ టెకీల‌కు షాకిచ్చిన ట్రంప్ స‌ర్కార్

-

ఇండియన్‌ టెకీల‌కు ట్రంప్ స‌ర్కార్ షాకిచ్చింది. హెచ్‌1-బీ వీసాల సంఖ్యను త‌గ్గిస్తూ కొత్త ప్రణాళిక‌ను తాజాగా ప్రక‌టించింది. అయితే భారత్ అనే కాదు అన్ని విదేశాల‌కు చెందిన టెక్నీషియన్స్‌కు ఇచ్చే వీసాల‌ సంఖ్యను ప‌రిమితం చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశంలో ఉద్యోగ కల్పన భారం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ నేతృత్వంలోని యూఎస్‌ ప్రభుత్వం పేర్కొంది.

హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్ కింద ఎవ‌రికి వీసా జారీ చేయాలి ? వారికి ఎంత జీతం ఇవ్వాలి ? అనే అంశాల‌ను త్వర‌లోనే రిలీజ్ చేయ‌నున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబ‌ర్ అధికారులు వెల్లడించారు. సాధార‌ణంగా ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం సుమారు 85,000 వేల హెచ్‌1బీ వీసాల‌ను జారీ చేస్తుండగా.. తాజా నియ‌మావ‌ళి ప్రకారం ఆ సంఖ్యను భారీగా అంటే మూడు రెట్ల దాకా తగ్గించనున్నట్టు చెబుతున్నారు. అయితే ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం తీసుకోవడం వలన లోకల్ వోటర్లు ట్రంప్ కు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version