ట్రంప్ కళ్ళకు గంతలు కడుతున్న సీఎం..!!

-

ప్రపంచ దేశాలలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రపంచం మొత్తం అభివృద్ది వైపు అడుగులు వేస్తోంది. కాని గుజరాత్ లో మాత్రం అభివృద్ధి, నగర సుందరీకరణ అంశాలు అడుగులు కాదు ఏకంగా పరుగులు పెడుతున్నాయి. రోజూ గుజరాత్ ని చూస్తూనే ఉన్నాం, నిన్న మొన్న లేని పరుగులు ఆకాశ్మాత్తుగా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా?? గుజరాత్ లో ఏమి జరుగుతోంది అనుకుంటున్నారా?? అయితే అసలు కథ తెలుసుకోవాల్సిందే…

అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24,25 తేదీల్లో ఇండియా పర్యటించనున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే ట్రంప్ సారు, మోది సారుతో కలిసి అహ్మదాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంజర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాక రోడ్ షో నిర్వహించాబోతున్నారట. రోడ్ షో అంటే గుజరాత్ అభివృద్ధి మొత్తం చూసుకుంటూ, ఇంకా నగర సౌందర్యాన్ని కూడా విక్షిస్తారు కదా.. అందుకే గుజరాత్ లో రోడ్ పక్క నుంచి అర కిలోమీటరు దూరం 6 నుంచి 7 అడుగుల ఎత్తైన గోడను అహ్మాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. బాగుంది కాదా అనుకుంటునారు కదా.. కాని అసలు విషయం..

 

ఆ ఏరియాలో దశాబ్దాలుగా దేవ్ శరణ్ పేరుతో మురికివాడ ఉంది. ఇక్కడ సుమారుగా 2500 మంది జనాభా కూడా నివసిస్తున్నారు. అందుకే ఆ మురికి వాడ కనపడకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే,ఈ చర్యను ప్రతిపక్ష కాంగ్రెస్   తీవ్రంగా  విమర్శించింది. ఈ నేపధ్యంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ, నగర సుందరీకరణ పేరుతో ఈ మురికి వాడను ప్రభుత్వం దాచే ప్రయత్నం చేస్తోందని, అభివృద్ధి చేయడానికి బదులుగా, వెనుకబాటును కప్పిపుచ్చుతోందని, ఇదేనా గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news