ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం,జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఆహారాన్ని జీర్ణం చేసి ఇతరత్రా అనేక సమస్యలని మన దరికి రాకుండా చేస్తుంది.
అరటి పండు జీర్ణ సమస్యలకి దూరం చేస్తుందన్న నిజమే కానీ, ఎలాంటి అరటి పళ్ళని తినాలనేది కూడా తెలుసుకోవాలి. అవును, మార్కెట్లో అందంగా కనిపిస్తున్నాయని చెప్పి, పసుపు పచ్చగా లేని అరటి పళ్ళని తీసుకోకూడదు. ఆకుపచ్చగా ఉండే అరటి పళ్ళు అంతగా సాయం చేయవు. పసుపు పచ్చగా ఉండి వాటి మీద చిన్న చిన్న నల్ల మచ్చలు ఉంటే అది తినడానికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్లే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అరటి పళ్ళు మన శరీరంలో నీటి మీద నడిచినట్లుగా తేలుతాయి.
పేగులో పేగు లైనింగ్ కి తాకకుండా ఉంటాయి. పేగుకి, పేగు లైన్ కి మధ్య కవచంలా ఏర్పడతాయి. అందువల్ల ఇవి పేగును తాకి ఇబ్బంది పెట్టవు. తద్వారా ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.రోజూ తీసుకునే ఆహారంలో అరటి పళ్ళని భాగం చేసుకుంటే ఇంకా అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. దీనిలో ఉండే పొటాషియం మనకు జీవక్రియ పరిస్థితిని మెరుగుపర్చి ఆరోగ్యంగా చేస్తుంది. అందుకే పళ్ళలో అరటి పండుని ఆహారంగా చేసుకుంటే ఉత్తమం.