శానిటైజర్ వల్ల పొడిబారుతున్న చర్మాన్ని మృదువుగా మార్చడానికి కావాల్సిన టిప్స్..

-

కరోనా సెక్ండ్ వేవ్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్ ని బాగా ఉపయోగిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏది ముట్టుకున్నా వెంటనే చేతులని శానిటైజ్ చేసుకుంటున్నాం. ఐతే ఇలా మాటి మాటికీ శానిటైజ్ చేయడం వల్ల చర్మం దాని మృదుత్వాన్ని కోల్పోతుంది. దానికి కారణం శానిటైజర్ లోని ఆల్కహాల్. చర్మాన్ని పొడిగా చేయడంలో ఆల్కహాల్ బాగా పనిచేస్తుంది. ఎక్కువసార్లు చేతులని సబ్బుతో కడగడం, హ్యాండ్ శానిటైజర్ తో మర్దన చేయడం వల్ల కోమలత్వం తొలగిపోయి పొడిగా మారుతుంది.

దీనర్థం శానిటైజర్ ఉపయోగించకూడదని కాదు. దాన్ని ఉపయోగిస్తూనే చర్మాన్ని తేమగా ఉంచుకునే సలహాలు మా దగ్గర ఉన్నాయి. కరోన వైరస్ ని అంతం చేసే శానిటైజర్ ని వాడుతూ చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి కావాల్సిన టిప్స్.

చేతులను మృదువుగా ఉంచడానికి గోరువెచ్చని నీటితో కడుక్కోండి. అలాగే హ్యాండ్ క్రీమ్ వాడండి.

ఏదైనా పనిచేసేటపుడు చేతులకి గ్లవ్స్ ధరించండి. దీనివల్ల చేతులకి కఠిన పదార్థాలు తగలకుండా ఉంటాయి.

పనిచేసిన వెంటనే హ్యాండ్ క్రీమ్ పూసుకోవడం మర్చిపోవద్దు. చేతులని ఎప్పటికప్పుడు తేమగా ఉంచగలిగితే పొడిగా మారకుండా ఉంటుంది.

ఇంకా కొబ్బరి నూనెని వాడండి. రోజుకి రెండు మూడు సార్లు కొబ్బరినూనెతో మసాజ్ చేయండి. పొద్దున్న కష్టమనుకుంటే రాత్రిపూట చేసుకోవచ్చు.

పెట్రోలియం జెల్లీ తీసుకుని రాత్రి పడుకునే ముందు చేతులకి మర్దన చేయండి. తర్వాత చేతికి గ్లవ్స్ ధరించండి. దీనివల్ల చేతులు మృదువుగా తయారవుతాయి.

బాదంనూనేని రెండు లేదా నాలుగు స్పూన్లు చేతులకి రాయండి. ఆ తర్వాత కొద్దిసేపు మసాజ్ చేయండి. బాదం నూనేలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. తద్వారా అది చేతులని మృదువుగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version