ఇవాళ,రేపు టీఎస్‌ అసెంబ్లీ సమావేశాలు..ఈ బిల్లుల అమోదం కోసమేనా?

-

ఇవాళ, రేపు రెండ్రోజులు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది..గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న GHMC సవరణ చట్టానికి ఆమోదింపచేసుకోడానికే ప్రధానంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.. దీంతో పాటు మరికొన్ని చట్టాల్లో కూడా సవరణలు చేస్తూ బిల్లులని ఆమోదించనున్నారు..వచ్చే ఫిబ్రవరితో జీహెచ్‌ఎంపీ పాలకమండలి పదవికాలం ముగియనుండటంతో జనవరి చివరి వారంలోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తుంది..వచ్చే ఎన్నికల లోపే ప్రజలకు సేవలు మరింత పటిష్టంగా అందించడానికి గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ యాక్ట్‌లో సవరణలతో పాటు మరికొన్ని చట్టాల్లో సవరణలు తీసుకొస్తూ బిల్లులను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బిల్లుల ఆమోదంకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇవాళ అసెంబ్లీ, రేపు శాసన మండలి సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీముందుకు తెచ్చే బిల్లులను శనివారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
గ్రేటర్‌ పాలకమండలిలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లకి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది. వార్డు కమిటీల పని విధానాలు, వార్డుల రిజర్వేషన్‌ అంశంలో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ సవరణల బిల్లుని శాసనసభలో ప్రవేశ పెట్టనుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో నిందితుడు కోర్ట్‌కి సక్రమంగా హాజరు కాకపోతే షూరిటీలకు ఫైన్ వేసే విధంగా చట్ట సవరణ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ముసాయిదా బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తర్వాత రోజు శాసనమండలి ఆమోదించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news