తెలంగాణా ఎంసెట్ షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుండి అంటే ?

-

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు అయింది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. మే 18 దరఖాస్తుకు చివరి తేదీ అని తెలుస్తోంది. 5 వేల లేట్ ఫీతో జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది. ఈ సారి ఇంటర్ ప్రథమ సంవత్సరం మొత్తం సిలబస్, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ తోనే ఎంసెట్ ఎంట్రెన్స్ జరగనుంది. 

జులై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేపథ్యంలో ఎంసెట్ లో మొదట జులై 5,6 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ ..జులై 7,8,9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది .సిలబస్ తగ్గించిన నేపథ్యంలో పరీక్ష విధానంలో మార్పులు చేయొద్దని సెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో మాదిరిగానే 160 మార్కులు.. మూడు గంటల సమయం ఉండనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరగనుంది. జనరల్ అభ్యర్థులకు పరీక్ష ఫీ 800 రూపాయలు…ఎస్సీ, ఎస్టీ లకు 400 రూపాయలు ఫీజు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news