బ్రేకింగ్ : తెలంగాణాలో టపాసులు బ్యాన్.. అమ్మినా కొన్నా కఠిన చర్యలు

-

దీపావళి పండుగ పై తెలంగాణా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్రప్రకాష్ పిల్ ధాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పిటిషనర్ పేర్కొన్నారు.

క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతాని పిటీషనర్ పేర్కొన్నారు. పిటీషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హైకోర్టు, ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందని గుర్తు చేసింది. కలకత్తాలో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందన్న హైకోర్టు, అందుకే తెలంగాణ లో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలని పేర్కొంది. ఎవరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నెల 19న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news