తెలంగాణాలో కరోనా పరిక్షలు తగ్గడంపై హైకోర్ట్ సీరియస్ అయింది. నేడు కరోనా అత్యవసర పరిస్థితికి సంబంధించి విచారణ చేపట్టిన హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్ట్ దిక్కారణ నోటీసులు ఇస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. పరిక్షలు ఎందుకు తగ్గించారు అంటూ ఫైర్ అయింది. పాతబస్తీ లో నిబంధనలు పాటించడం లేదు అని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సరిహద్దుల్లో అంబులెన్స్ లు అడ్డుకోవడం దారుణం అని అభిప్రాయపడింది. అంబులెన్స్ లను అడ్డుకోమని మీకు ఎవరుచెప్పారు అంటూ నిలదీసింది. అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని హైకోర్ట్ నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవు అంటూ హైకోర్ట్ మండిపడింది.