తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్ట్ చివాట్లు, పబ్లిక్ కమీషన్ లో ఒక్కరు ఉండటం ఏంటి…?

తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్ట్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఎలాంటీ సభ్యులు లేరని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్… పబ్లిక్ కమిషన్ లో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని ఈ సందర్భంగా నిలదీసింది. పబ్లిక్ కమిషన్ కు చైర్మన్, మెంబర్స్ లేకపోవడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిక్ కమిషన్ క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని నిలదీసింది.

తెలంగాణ పబ్లిక్ కమిషన్ చాలా ముఖ్యమైనదన్న హైకోర్టు.. నాలుగు వారాలల్లో కమిషన్ లో ఉన్న ఖాళీలను పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. వెంటనే కమిషన్ సభ్యుల నియామకాలు చేపడుతామని ఏజీ వివరణ ఇచ్చారు. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.