Big News: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి టెన్త్‌ హాల్‌ టికెట్లు..

-

తెలంగాణలోని టెన్త్‌ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్‌ టికెట్లు జారీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్‌ టికెట్లు పంపినట్లు పేర్కొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు పొందవచ్చనీ, అలాగే www.bse.telangana.gov.in నుంచి సైతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డైరెక్టర్‌ చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.

SSC exams in Telangana likely from May 17

మే 23- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)
మే 24- సెకండ్ లాంగ్వేజ్..
మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మే 26- మ్యాథమెటిక్స్‌
మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌)
మే 28- సోషల్‌ స్టడీస్‌
మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)
మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌)
జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ)

Read more RELATED
Recommended to you

Latest news