TSPSC జిరాక్స్ సెంటర్.. ఇచట అన్ని సర్కార్ కొలువుల క్వశ్చన్ పేపర్లు లభించును

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రతి పక్షాలు ఇప్పటికే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం.. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీంతో ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది.

అయితే తాజాగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ గోడపై వాటిని అంటించారు. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్.. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభించును అంటూ రాశారు. తప్పు చేసిన కమిషన్ బోర్డును రద్దు చేయాలని అందులో కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. ప్రశ్నాపత్రాల లీకేజీలో ఆయన కుటుంబసభ్యుల పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. అలాగే నష్టపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని.. అప్పటి వరకు వారికి నెలకు రూ.10,000 చొప్పున ఇవ్వాలని అందులో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news