మరో గుడ్ న్యూస్ : రేపటి నుండి సిటీ బస్సులకి పాస్ లు !

-

రేపటి నుండి సిటీ బస్సులకి నెలవారీ పాసులు జారీ చేయనున్నారు. హైదరాబాద్ లో మొత్తం తొమ్మిది బస్ పాస్ కేంద్రాల ద్వారా ఈ పాసులు జారీ చేయనున్నారు. ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, మెహిదీపట్నం, సీబీఎస్, శంషాబాద్, అఫ్జల్ గంజ్, పఠాన్ చెరు, షాపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్, మేడ్చల్, వనస్థలిపురం, హయత్ నగర్ లో బస్ పాస్ కేంద్రాలలో బస్ పాస్ లు జారీ చేయనున్నారు.

అయితే మార్చి నెల బస్ పాసుల మీద మాత్రం అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక హైదరాబాద్‌లో మొత్తం 29 బస్సు డిపోలుండగా ఆ డిపోలు అన్నీ కలిపి 2,800 బస్సులున్నాయి. వీటిలో 25 శాతం బస్సులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపరేట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ డిపోకు ఈరోజు 35 బస్సుల చొప్పున నడిపారు. సిటీ బస్సులతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సర్వీసులను పునరుద్ధరించారన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news