దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది..గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. జంట నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది దాదాపు 3000 అదనపు బస్సులు నడుపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు..ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించారు ఆర్టీసీ అధికారులు. అయితే ఈ ప్రత్యేక సర్వీసులు ఇతర రాష్ట్రాలకు కాకుండా తెలంగాణ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలియజేసింది..అవసరమైతే రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
దసరా పండుగ నేపథ్యంలో వివిధ రూట్లలో అధికారులు పలు మార్పులు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్, స్పెషల్ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, జేబీఎస్ నుంచి నడుస్తాయి. యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్, ఉప్పల్ బస్ స్టేషన్ నుంచి నడువనున్నాయి. మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ నుంచి నడుస్తాయన్నారు.
గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ..పండుగకు ప్రత్యేక బస్సులు..రూట్ల వివరాలు.
-