ఇవాళ సమావేశమైన టిటిడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుందని.. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తామని వెల్లడించారు. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స నిర్వహించారని.. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులుకు కేటాయిస్తామని.. బోర్డ్ సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారన్నారు. హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తామని.. నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మిస్తామని వెల్లడించారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం తీసుకున్నారని.. హిందు దర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తామని.. ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేస్తామని.. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామని ప్రకటించారు. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తామని.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తామన్నారు.