టీటీడీ అర్చకులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ మధ్యనే అర్చకులకు రిటైర్మెంట్ ఉండదు అంటూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆప్షన్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అర్చకులను విధుల్లోకి తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వారికి కొన్ని ఆప్షన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తోంది.

ttd
ttd

అదేమిటి అంటే పే స్కేలు తీసుకుని 65 ఏళ్లకు రిటైర్ అయి ఆ తర్వాత కుమారుడి పేరు ప్రతిపాదించేలా మొదటి ఆప్షన్. లేదా సంభావన తీసుకుని ఆరోగ్యం గా ఉన్నంత వరకు కొనసాగి ఆ తర్వాత కుమారుడి పేరు ప్రతిపాదించేలా రెండో ఆప్షన్ ఇచ్చింది. రిటైర్మెంట్ కు సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ ఇస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news