ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కార్యక్రమం విషయంలో స్పష్టత లేదు. అమరావతిలో విశాఖలో రెండు కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తోంది. అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయం కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.
దక్షిణాదికి ఆ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ కూడా జరిగిందని భూమిని కూడా కొనుగోలు చేసారని సమాచారం. అయితే అది విశాఖలో ఏర్పాటు చేస్తారా లేక పోతే అమరావతిలో ఏర్పాటు చేస్తారనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. అమరావతిలో ఏర్పాటు చేస్తే మాత్రం అన్నివిధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
అందుకే ఈ భవనం శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర నాయకత్వానికి పంపించారు అని అంటున్నారు. కొన్ని రోజులుగా దక్షిణాదిన దృష్టి పెడుతున్న భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలవాలని పట్టుదలగా వ్యవహరిస్తుంది.
అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి సారించి అడుగులు వేస్తున్నారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తే తెలంగాణకు కర్ణాటక తమిళనాడు కి కాస్త ఉపయోగకరంగా ఉంటుందని… ఇక్కడ నేతలు కూడా సమన్వయం చేసుకోవడానికి బాగుంటుందని ప్రతి ఆదేశాన్ని కూడా ఢిల్లీ నుంచి పాటించడం కంటే కూడా ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.