తమిళనాడులో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా ఎన్నికల హడావుడి లో ఉన్న కారణంగా ఎన్ని కరోనా కేసులు వస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల హడావుడి పూర్తికావడంతో నేటి నుంచి తమిళనాడులో కఠిన ఆంక్షలు అమలు చేసే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కర్ణాటక, పుదుచ్చేరిలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తమిళనాడులో కూడా ఈరోజు నుంచి కరోనా రూల్స్ కఠినతరం చేయనున్నారు.
ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రజలు మాత్రం నాయకుల మీద మండిపడుతున్నారు. ఎన్నికల ఉన్న కారణంగా వేలాది మందితో సభలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఇప్పుడు మళ్ళీ కఠిన ఆంక్షలు అంటూ తమను ఇబ్బందులు పెడతారు అంటూ తమిళ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా తమిళనాడు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే ఇక్కడ పోటాపోటీగా పార్టీలు ప్రచారం నిర్వహించాయి.